ప్రకాశం ప్రజల జీవితాలతో ఆటలు వద్దు– కందుల
మీ రాజకీయ భవిష్యత్తు కోసం పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాలతో ఆటలు వద్దని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జిల్లా మంత్రులకు మరియు వైసీపీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు.
కొనకనమిట్ల మండలం మర్రిపాల్లెం గ్రామంలో కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామం లో ప్రతి వీధి తిరుగుతూ”” కావాలి మార్కాపురం జిల్లా – ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి “” అంటూ నినాదాలు చేస్తూ కాగడా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రపతి ఆమోద ముద్ర తీసుకోవాలని రాజ్యాంగంలో స్పష్టంగా పొందు పరిచారని వివరించారనీ కానీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 పార్లమెంటులోకి గాను జిల్లాలు కాక 26 జిల్లాలు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కానీ అన్ని అర్హతలూ ఉన్న 27వ జిల్లాగా మార్కాపురం జిల్లాని ఎందుకు ప్రకటించరని మరియు ఇలాగే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు భవిష్యత్తులో చెంప పెట్టు లాంటి తీర్పు ప్రజాకోర్టులో ఇవ్వబోతున్నారారని హెచ్చరించారు.
ఏది ఏమైనా ప్రత్యేక మార్కాపురం జిల్లా కోసం మా పోరాటం ఆపబొమని ప్రభుత్వం దిగి మార్కాపురం జిల్లా ప్రకటన చేసే వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు మోర బోయిన బాబు రావు గారు, పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కనక నరసింహారావు గారు, ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత మువ్వా కాటంరాజు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అంకాల రోశయ్య, భీమా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాయుడు, గ్రామ తెలుగుదేశం నాయకులు రమణారెడ్డి వెంకటేశ్వర్లు, గురవయ్య, జై రామ్ రెడ్డి, కోటేశ్వరరావు, పూర్ణయ్య, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.