పట్టణంలో దోమల నివారణకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే ఇటీవల పడిన వర్షాల కారణంగా దోమలు వ్యాప్తి చెందడంతో నివారణకు శనివారం పంచాయతీ అధికారులు శ్రీకారం చుట్టారు. దోమల నివారణ మందుతో కూడిన పొగను వీధులలో విడిచే విధంగా ఫాగ్గింగ్ మెషీన్ ను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్, శానిటరి ఇన్స్పెక్టర్ మారుతిరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.