డోనాల్డ్ ట్రాంప్ భారత పర్యటనను నిరసిస్తూ రాస్తారోకో
భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్ట్) ఆధ్వర్యంలో మానవహారం రాస్తారోకో చేపట్టారు. వివరాలు లోకి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ను అడ్డుకోవలాని మరియు జాతీయ పౌర పట్టిక , పౌరసత్వం సవరణ చట్టాన్ని ఆడ్డుకొవలని కోరుతూ స్థానిక పెద్ద బస్టాండ్ నందు ఆదివారం నాడు రాస్తారోకో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ , ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ మరియు జిల్లా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు