పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించి… నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన డిపిఓ నారాయణరెడ్డి

గ్రామ పంచాయతీ పరిధిలోని పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించిన జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు..

వివరాల్లోకి వెళితే స్థానిక రోడ్డు రవాణా సంస్థ మైదానంలో శుక్రవారంనాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ మరియు సన్మానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి హాజరైన ఆయన మాట్లాడుతూ…..

కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా తీవ్రంగా ఆందోళన ఉన్న సమయంలో పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య సేవలు నిర్వహిస్తూ ప్రజా ఆరోగ్య రక్షణకోసం తీవ్రంగా కృషి చేస్తున్న….

పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గౌరవం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1800మంది పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా నేడు పొదిలి నందు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించామని…. అదే విధంగా పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీకి సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పనిచేస్తున్న 120మంది పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మరియు వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, సాయి రాజేశ్వరరావు, వాకా వెంకటరెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి, షేక్ రబ్బానీ, షేక్ గౌస్ , వర్షం ఫిరోజ్, మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.