అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిపిఓ నారాయణరెడ్డి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సీజనల్ అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి
అన్నారు.
పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి శుక్రవారం పారిశుద్ధ్య దినం కార్యక్రమంలో
జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు
అనంతరం గ్రామం నందు మూతవేసిన ఇండ్లను, నీరు నిల్వ ఉన్న పాత్రలు పలు ప్రదేశాలను పరిశీలించి దోమలు లార్వా పెరుగుచున్న వాటిని నిర్ములించి సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జి ఏసోబు పంచాయతీ కార్యదర్శిలు సుజాత, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు