కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన డిపిఓ నారాయణరెడ్డి

కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు ప్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ వేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సందర్శించానని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి అని
అదే విధంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దని అన్నారు.ప్రభుత్వ వైద్యులు డాక్టర్ షహిదా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ లో భాగంగా తమ దగ్గర ఉన్న అంతర్జాలం వివరాల ప్రకారం ప్రతి ఒక్కరికి ముందు రోజు సమాచారం అందిస్తామని వ్యాక్సిన్ వేసి అనంతరం డాక్టర్లు పర్యవేక్షణలో 30 నిమిషాలు ఉంచుతామని ఎవరు ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రఫీ, మరియు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు