ప్రజలు మానసిక వ్యాధుల పట్ల మూఢనమ్మకాలు వదిలి అవగాహన పెంచుకోవాలి : డాక్టర్ అఖిలేష్

స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాల నందు మానసిక వ్యాధులు, సమస్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారంనాడు ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా మానసిక వైద్యులు డాక్టర్ అఖిలేష్ మాట్లాడుతూ ప్రజలు మానసిక వ్యాధులపై ఉన్న మూఢనమ్మకాలను వదిలేసి మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని….. నిరంతర మార్పులు చెందుతున్న నేటి ఆధునిక సమాజంలో మానసిక ఒత్తిడి, నిద్రలేమి నిరాశనిస్పృహ వంటి పలురకాలైన మానసిక కారణాలు ఆత్మహత్యలకు సైతం దారి తీస్తున్నాయని…..

చిన్నతనం, వృద్ధాప్యం మరియు ప్రసవ సమయాలలో మానసికంగా ఇబ్బందులపై కూడా ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని ఏదైనా మానసిక సమస్యల సందేహాలపై 7675992864 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సమాధానం పొందవచ్చునని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్ చక్రవర్తి, క్లినికల్ సైకాలజిస్ట్ ఏడుకొండలు, సైకాలజిస్ట్ అనిల్ కుమార్, సిఆర్ఏ రామాంజనేయులు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.