ఇంటి ఇంటికి వైద్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ సుష్మా
ఇంటి ఇంటికి వైద్యం కార్యక్రమాన్ని ఉప్పలపాడు ప్రభుత్వం వైద్యశాల అధికారిణి సుష్మా లాంఛనంగా ప్రారంభించారు.
శనివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని 1వ సచివాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సుష్మా పచ్చా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం స్థానిక సచివాలయం నందు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో నందు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శ్రీనివాసులురెడ్డి, విజయ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు