మంచినీటి కోసం రోడ్డెక్కిన రామ్ నగర్ వాసులు…. పంచాయతీ ఆఫీసు ఎదుట రాస్తారోకో
పట్టణంలో తాగునీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది….. దానికితోడు అక్రమ కుళాయి కనెక్షన్లతో తాగునీటి కోసం ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు.
తాగునీటి కోసం మంగళవారం నాడు ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి దర్శి రోడ్డులోని రామ్ నగర్ వాసులకు అధికారులు స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో పంచాయతీ ఆఫీసు ఎదుట రాస్తారోకోకు దిగారు. ఈ రాస్తారోకో కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆఫీసువద్దకు చేరుకుని పోలీసు స్టేషన్ వద్దకు రమ్మని అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సముదాయించడంతో రాస్తారోకో విరమించారు.
ఈ విషయమై రామ్ నగర్ వాసులు మాట్లాడుతూ మంచినీటి సమస్యను ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని…… రామ్ నగర్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా అధికారులు విఫలయ్యారని….. డ్రైనేజీ వ్యవస్థ లేక గత ఏడాది 4పిల్లలు డెంగ్యూ జ్వరాల బారిన పడి చనిపోయారని ఈ విషయంలో కూడా అధికారులను కలిశామని చేస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు….. అలాగే వీధుల్లో సిసి రోడ్లను కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.