మత్తు పదార్థాలు విద్యార్థులు దూరంగా ఉండాలి : సిఐ సుధాకర్ రావు
పొదిలి పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శుక్రవారం నాడు మాదకద్రవ్యాలు నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ నిషేధిత మత్తుపదార్థాలకు యువజన విద్యార్థులు దూరంగా ఉండాలని మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని, మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారవద్దని డ్రగ్స్ వాడినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం హెరాయిన్, కొకైన్,గంజాయి,నాటు సారా లాంటి,మత్తు పదార్థాలు వాడడంతో మనిషి మెదడుపై మత్తు ప్రభావంతో ఆలోచనా శక్తి నశించి యువత నేరాలు బాట పడుతున్నారన్నారు.
యస్ఐ శ్రీహరి మాట్లాడుతూ కొందరు యువతని కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని అలాంటి చెడు దారుల్లో ఉండక సరైన మార్గంలో నడుచుకోవాలన్నారు. మాదకద్రవ్యాలు వాడుతూ పట్టుబడ్డా లేదా రవాణా చేసినా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని గంజాయి అమ్ముతూ లేక రవాణా చేస్తూ పట్టుబడ్డా గరిష్టంగా 20 సంవత్సరాలు వరకు శిక్ష, ఉంటుందని కొన్ని సమయాల్లో మరణశిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మత్తు పదార్థాలు మానవుని మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుందన్నారు. విచక్షణ కోల్పోతున్నారన్నారు.ఉన్నత చదువులు చదువుకుని తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.