సకాలంలో స్పందించిన పోలీసులు…… ప్రశంసించిన స్థానికులు
మల్లవరం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పోలీసులను స్థానికులు ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి తుఫాన్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో సమాచారం అందుకున్న పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్, ఎస్ఐ శ్రీరామ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పోలీసులు వాహనంలో వైద్యశాలకు తరలించి దరిశి డిఎస్పీ నాగరాజుకు సమాచారం అందించారు…… సమాచారం అందుకున్న డీఎస్పీ నాగరాజు హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలంలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సూచనలను అందించారు. తుఫాను వాహనంలో ఇరుక్కునిపోయిన డ్రైవర్ జకీర్ హుస్సేన్ ను బయటకు తీయడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పొదిలి పోలీసు సిబ్బంది ……. ఆర్తనాదాలు చేస్తున్న డ్రైవరుకు ధైర్యం చెప్తూ స్థానికుల సహాయంతో గంటకుపైగా శ్రమించి ఎంతో చాకచక్యంగా డ్రైవరును బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎంతో శ్రమించి ఘటనలో డ్రైవరు పక్కనే కూర్చుని క్యాబిన్ లో ఇరుక్కుని మృతి చెందిన మోహన్ రావును కూడా బయటకు తీశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై స్పందించిన తీరును స్థానికులు ప్రశంసించారు.