డియస్పీగా భాధ్యతలు స్వీకరించిన నాగరాజు…

దరిశి నూతన డిఎస్పీగా నియమితులైన కె నాగరాజు భాద్యతలు స్వీకరించారు. వివరాల్లోకి వెళితే నూతనంగా దరిశి డియస్పీగా నియమతులైన కె నాగరాజు ఆదివారం ఉదయం భాద్యతలు స్వీకరించారు. గతంలో ఏసీబీ డిఎస్పీగా కడపనందు విధులు నిర్వహిస్తున్న నాగరాజును దరిశి డిఎస్పీగా బదిలీ చేస్తూ ఈ మేరకు మంగళవారంనాడు రాష్ట్ర పోలీసుశాఖ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీచేశారు ఈ నేపధ్యంలో ఆయన ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.