సరుకు రవాణా వాహనాల్లో ప్రజా రవాణా చేస్తే కఠిన చర్యలు : డియస్పీ నారాయణస్వామి రెడ్డి వెల్లడి

సరుకు రవాణా వాహనాల్లో ప్రజా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పోలీసు స్టేషన్ నందు గురువారం నాడు యస్ఐ శ్రీహరి అధ్యక్షతనతో ప్రమాద నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదం జరిగితే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని అన్నారు.

పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ పరిమితి మించి ఆటో ఎక్కిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని సరుకు రవాణా వాహనాల్లో ప్రజా రవాణా చేస్తే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు,పొదిలి యస్ఐ శ్రీహరి,కొనకనమీట్ల యస్ఐ శివ పొదిలి ట్రాఫిక్ యస్ఐ షేక్ వదూద్ మరియు సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు , ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు