బోధనా పద్ధతులు శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న దరిశి డియస్పీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు ఎంఇఓ శ్రీనివాసులురెడ్డి అద్యక్షతన జరిగిన బోధనా పద్ధతులు మెరుగైన శిక్షణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన దరిశి డియస్పి నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు ద్వారా ప్రభుత్వం పాఠశాలలో బోధనా కొనసాగుతుందని
సమాజానికి మంచి డాక్టర్ మంచి లాయర్ మంచి సైన్సిస్ట్ ఇలా సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనా అని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరుతో అత్యున్నత వసతులు మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్య అందించడంలో కీలక పాత్ర వహిస్తుందని మరో పదేళ్లలో విద్యాపరంగా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగబోతుందని ఆయన అన్నారు

ఈ శిక్షణ తరగతుల్లో మూడు మండలాలు చెందిన ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు సీఆర్పీలకు బోధనలో అనుసరించవలసిన పద్ధతులపై శిక్షణ ఇచ్చారు

అనంతరం డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి సిఐ సుధాకర్ రావు లను ఘనంగా సత్కరించి మెమోటోలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కిషన్ మరియు మూడు మండలాలు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు