ప్రశాంతంగా ముగిసిన విద్యా కమిటీ ఎన్నికలు

పొదిలి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యా కమిటీ‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల కమిటీ పాలకవర్గం ఎంపీక చెయ్యాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించారు

పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్లు ప్రకారం తొలిత ఎన్నికలు నిర్వహించి అనంతరం వారిచేత ప్రమాణం స్వీకారం చేయించారు.

పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్ మునగాల కిరణ్ కుమార్ వైస్ చైర్మన్ గా షేక్ రిజ్వాన్ బేగం మరో 13 మంది తో కూడిన పాఠశాల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికలను ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులురెడ్డి, ఉపాధ్యాయులు రోజా రాణి, ఆధ్వర్యంలో నిర్వహించారు.

జిల్లా పరిషత్ పాఠశాల (దక్షిణం) పాఠశాల కమిటీ చైర్మన్ గా షేక్ బికారి వైస్ చైర్మన్ గా పోలేపల్లి ప్రమీల మరో 13 మంది సభ్యులతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి వి పద్మావతి పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.

పొదిలి మండలం మల్లవరం ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా రెడ్డిబోయిన నరసింహారావు, వైస్ చైర్మన్ గా తాళ్లూరి అనుషా మరో ఏడు మంది తో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


కొండాయిపాలెం మండల ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది

చైర్మన్ పదవికి దుగ్గిరెడ్డి కాశమ్మ చేబ్రోలు చిరంజీవి పోటీ పడగా చేబ్రోలు చిరంజీవి గెలుపొందారు.
వైస్ చైర్మన్ గా పులుకూరి ఇస్తారమ్మ తో పాటు మరో 13 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

పోతవరం మండల పరిషత్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా మైలా మల్లేశ్వరి , వైస్ చైర్మన్ గా బోనం కోటి రెడ్డి లో తోపాటు మరో 13 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.

వివిధ పాఠశాల్లో ఎన్నికల్లో మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ రెడ్డిబోయిన సుబ్బాయ్య, సన్నేబోయిన సుబ్బారావు, పండు అనీల్ తదితరులు పాల్గొన్నారు