ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

పొదిలి,కొనకనమిట్ల,మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక విశ్వనాథపురంలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థ నందు పొదిలి,కొనకనమిట్ల,మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2022- 23 కి గాను నూతన కార్యవర్గం ఎన్నిక కోసం యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు

ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ కాలేషా ఉపాధ్యక్షుడిగా యద్దనపూడి వీర బ్రహ్మం ( బ్రహ్మం డిజిటల్స్) సెక్రటరీగా జి భాను, జాయింట్ సెక్రటరీగా జె వెంకటేశ్వర్లు,కోశాధికారిగా షేక్ షఫీ, గౌరవ అధ్యక్షులుగా గోపిశెట్టి శ్రీను,సామంతపూడి పరమేశ్వరరావు,
గౌరవ సలహదారులుగా తోట సుబ్బారావు,సిహెచ్.వెంకటేశ్వర్లు (విజయ్ స్టూడియో) అసోసియేషన్ యూత్ కమిటీ సభ్యులుగా పి దాసు,ఎం రమేష్, షేక్ షాకిర్,జి శ్యాంబాబు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.