పంచాయతీ కార్యదర్శిల సంఘం అధ్యక్షులుగా బ్రహ్మ నాయుడు ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ పంచాయతీ కార్యదర్శిల సంఘం పొదిలి మండలం అధ్యక్షులుగా నక్కా బ్రహ్మ నాయుడు ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో షేక్ నాగూర్ వలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
గౌరవ అధ్యక్షులు ఈఓఆర్డీ రాజశేఖర్, అధ్యక్షులు నక్కా బ్రహ్మ నాయుడు ఉపాధ్యక్షులు పాలేటి శ్రీనివాసులు, కార్యదర్శిగా యం పద్మా , సంయుక్త కార్యదర్శిగా పవన్ కుమార్, కోశాధికారిగా యు శేషగిరి, జిల్లా కౌన్సిలర్ గా నక్కా శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులుగా ఐ శ్రీదేవి, షేక్ మల్లికా సుల్తానా, దండ వెంకటేశ్వర రెడ్డి, ఏల్చూరి వెంకట శేషయ్య, వి శ్రీకాంత్ రెడ్డి, షేక్ షేహనాజ్ బేగం, ధర్మవరపు ప్రసాద్ తో కూడిన కార్యవర్గం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షేక్ నాగపూర్ వలి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు