పొదిలి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
పొదిలి బార్ అసోసియేషన్ 2022-23 సంవత్సరానికి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారం స్థానిక పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లోని బార్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కమిటీ అధ్యక్షులు గా వరికూటి నాగరాజు, ఉపాధ్యక్షులుగా బోడగిరి వెంకటేశ్వర్లు, మహిళా ఉపాధ్యక్షురాలు గాన కుమారి, ప్రధాన కార్యదర్శి యస్ ఎం భాషా, కా, కార్యదర్శి శైలజా, కోశాధికారి రామ్మోహన్ రావు, లైబ్రరీన్ మునగాల వెంకట రమణ కిషోర్, కార్యవర్గ సభ్యులు గా శ్రీపతి శ్రీనివాస్, సుబ్బారావు, బి సురేష్ కుమార్, లక్ష్మీ రెడ్డి, ఖాదర్ వలీ,రాఘవ రావు లతో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.