పార్థసారథికి నివాళులర్పించిన ఎలక్ట్రానిక్ మీడియా
ఆంధ్రప్రదేశ్ నందు కోవిడ్ పాజిటివ్ తో మృతి చెందిన తొలి జర్నలిస్ట్ తిరుపతి సివిఆర్ ఛానల్ కెమెరా మెన్ పార్థసారథి మృతి పట్ల పొదిలి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోడ్లు భవనముల అతిధి గృహంలో మంగళవారంనాడు పార్థసారథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం 50లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వడ్డే వేణు, అధ్యక్షులు భాను చంద్రశేఖర్, అసోసియేషన్ నాయకులు జెకే విశ్వనాథం, గిద్దలూరు ప్రశాంత్, షేక్ మదార్ వలి, ఉడుముల రమణారెడ్డి, రాయల్, పట్నం శ్రీనివాస్, కుందూరు శ్రీనివాస్ రెడ్డి, అంకిరెడ్డి , బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.