హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు :డియస్పీ నాగరాజు

పొదిలి మండలం ఏలూరు గ్రామంలో బుధవారం హత్యకు గురైన చిన్నపురెడ్డి రమణారెడ్డి కేసులో ముద్దాయిలైన చిన్నపురెడ్డి సుబ్బారెడ్డి, చిన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి, చిన్నపురెడ్డి సుబ్బరామిరెడ్డి లను మంగళవారం ఏలూరు గ్రామ శివారు ప్రాంతంలో అరెస్టు చేసినట్లు దరిశి డియస్పీ కె నాగరాజు పొదిలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏలూరు రెవెన్యూ సర్వే నెంబర్ 265 నందు పొలంలోకి బుధవారం ఉదయం చిన్నపురెడ్డి శ్రీను, అతని సోదరుడు రమణారెడ్డిలు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళగా వారి దాయదులైన పెద్దనాన్న చిన్నపురెడ్డి సుబ్బారెడ్డి, అతని కుమారులు బ్రహ్మ రెడ్డి, సుబ్బరామిరెడ్డిలు ఒక పథకం ప్రకారం ట్రాక్టర్ సిద్ధంగా చేసుకొని రమణారెడ్డిని ట్రాక్టరుతో తొక్కించి చంపగా శ్రీనును ట్రాక్టర్ క్రిందవేసి తొక్కించి చంపే ప్రయత్నం చేయగా చూట్టూ ప్రక్కన వారు, బంధువులు అడ్డుకుని అతనిని ప్రాణాలతో కాపాడి వైద్యశాలకు తరలించారు. గాయపడిన శ్రీను నుండి పొదిలి యస్ఐ శ్రీరాం వాంగ్మూలం తీసుకుని క్రైం నెంబర్ 08/2019 సెక్షన్ 302, 307, 34 ఐపీసి క్రింద కేసులు నమోదు చేసి జిల్లా యస్పీ సత్య ఏసుబాబు పర్యవేక్షణలో పొదిలి సిఐ షేక్ చిన్న మీరాసాహెబ్ దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ముద్దాలను రాబడిన సమాచారం మేరకు మద్యవర్తుల సహాయంతో మంగళవారం ఉదయం ఏలూరులోని వారి ఇంటి వద్దకు చేరుకుని ముద్దాయిలైన చిన్నపురెడ్డి సుబ్బరామిరెడ్డి (30), బ్రహ్మ రెడ్డి(38), సుబ్బారెడ్డి (64)లను అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారని అదేవిధంగా వారు హత్యకు ఉపయోగించిన ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నామని హత్యకు భూ వివాదమే కారణమని డియస్పీ కె నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో పొదిలి సిఐ షేక్ చిన్న మీరాసాహెబ్, పొదిలి యస్ఐ శ్రీరాం, తాడివారిపల్లి యస్ఐతదితరులు పాల్గొన్నారు.