ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ధర్నా

పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద బుధవారం నాడు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేపట్టారు..

తమకు ఉద్యోగ భద్రత,కనీస వేతనం కల్పించాలని, రాజకీయ ఒత్తిళ్లు తో తొలగింపులు ఆపాలని పలు డిమాండ్ తో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం కార్యదర్శి ఏం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక బోర్డు ఆదేశాల మేరకు కనీస వేతనం 21 వేల రూపాయల ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు తో అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

సంఘం అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ మండల పరిధిలో బదిలీలకు అవకాశం కల్పించాలని, పొదిలి నగర పంచాయితీ పరిధిలో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు