పొదిలిలో కంచి కామకోటి పీఠం విద్యా వైద్య,వేద సంస్థలు ఏర్పాటు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి మండలం ఓబులక్కపల్లి గ్రామంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న విద్యా వైద్య వేద పాఠశాలను శనివారం నాడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పరిశీలించారు.

మద్రాసు నగరం బయట కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలి లో విద్యా వైద్య,వేద సంస్థలు ఏర్పాటు చెయ్యడం మరియు సనాతన వైదిక ధర్మం గ్రామాని శుభపరిణామం

35 ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణం పనులను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు పరిశీలించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో భారిగా భక్తులు తరలివచ్చారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా పొదిలి సిఐ కృష్ణం వీరా రాఘవేంద్ర, యస్ఐ కోమర మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.