పొదిలి నగర పంచాయితీ వార్డుల విభజన పూర్తి 2011 జనాభా లెక్కల ప్రకారం 20 వార్డుల ఏర్పాటు వార్డు అభ్యంతరాలు పై 24వ తేది వరకు గడువు

                      పొదిలి, కంభాలపాడు,మాదాలవారిపాలెం, నంది పాలెం నాలుగు గా గ్రామ పంచాయతీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజపత్రం నెంబర్ 17 ప్రకారం తేదీ 31.12.2020 ఉత్తర్వులు జారీ చేసినా పిదప పురపాలక శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు మేరకు 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం నగర పంచాయితీ నందు భౌగోళిక స్వరూపం హద్దులతో 20 వార్డులను ఏర్పాటు చేసినట్లు పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక నగర పంచాయితీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ వార్డు హద్దులు మరియు భౌగోళిక స్వరూపం పైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్న 24వ తేదీ లోపల నగర పంచాయితీ కార్యాలయం నందు ‌అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు.