ఇసుక కొరత నిరసన దీక్షను జయప్రదం చెయ్యండి : కందుల

ఇసుక కొరతపై తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు మార్కపురం రెవెన్యూ డివిజన్ కార్యలయం వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల నిరసన దీక్ష నిర్వహింస్తున్నట్లు మార్కపురం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసన దీక్షను అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యాలిని విజ్ఞప్తి చేసారు