వేతన సవరణ చేయాలంటూ ధర్నా
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారంనాడు గ్యారేజ్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు డిసెంబర్ 11 మరియు 12వ తేదీలలో రాష్ట్రంలో అన్ని డిపోలు మరియు గ్యారేజిల వద్ద ధర్నా కార్యక్రమాలని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ తక్షణమే చేపట్టాలని, అలాగే క్రమశిక్షణ నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు సంఘంతో చర్చలు జరపకుండా కార్మికుల కుదింపు నిర్ణయాలు తీసుకోవడం తగదని తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న ఆరు జతల యూనిఫాం నగదు చెల్లించాలని, కార్గో డ్యూటీలో మహిళలకు అవకాశం కల్పించాలని, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం ఇవ్వాలని, గ్యారేజిలో సర్క్యులర్ 3ని రద్దుపరచి, ఖాళీలను భర్తీ చేయాలని, ఇంకా పలు కార్మిక సమస్యలకై ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేషయ్య, రీజియన్ నాయకులు పిఏ ఎన్ రెడ్డి, సెక్రెటరీ కెవి రావు, కొండలు, అంజయ్య, సుబ్బారావు, విజయలక్ష్మి, మల్లీశ్వరి, పద్మ, రమాదేవి, కాంతమ్మ, వాసులు, షరీఫ్, జిలాని, ఎన్ కె వి రావు, తదితరులు పాల్గొన్నారు.