గంటసేపు కొనసాగినా ఆపరేషన్ ఆవు సురక్షితం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణంలో ఆవులు పెద్ద ఎత్తున రోడ్లు మీద సంచారిస్తు ఉంటాయి. స్థానిక పొదిలి రథం రోడ్డు లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న చెట్లు కింద్ర ఆవులు సేద తీర్చుకుంటూ ఉండే క్రమంలో మంగళవారం నాడు ఒక్కసారి ఒక ఆవు మున్సిపల్ కాలువలో ఇరుక్కోని పోయిన విషయాన్ని గుర్తించినా స్థానికులు హుటాహుటిన రక్షించే ప్రయత్నం చేయగా ఉపయోగం లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన జెసిబి రంగంలోకి దించి ఆవును బయటకు తీసారు.

గంటసేపు జరిగిన ఆపరేషన్ లో వందలాది మంది స్థానికులు అక్కడే ఉండి ఆవును బయటకు తీసిన తర్వాత వెనుతిరిగారు.