అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని ఆంధ్ర ప్రగతి బ్యాంకు రీజనల్ మేనేజర్ హేమలత అన్నారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక పొదిలి జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ తారావాణీ అధ్యక్షతనతో అవినీతి నిర్మూలన వారోత్సవాలు భాగం గా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ హేమలత మాట్లాడుతూ మన దేశ ఆర్థిక,రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ప్రధాన అవరోధంగా మారిందని ప్రతి పౌరుడు జాగ్రత్తగా వ్యవహరించస్తు నీతి మరియు సమగ్రత ప్రమాణాలు పాటిస్తూ అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తారావాణీ, పొదిలి శాఖ బ్యాంకు మేనేజర్ సునీల్ గుప్తా, హబిబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బెగ్ కళాశాల, బ్యాంకు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు