ఈవియం వద్దు బ్యాలెట్ తో ఎన్నికల జరపాలని ఈవియం యంత్రంపై ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేసిన బియస్పీ నేత

ఈవియం వద్దు బ్యాలెట్ తో ఎన్నికల జరపాలని ఈవియం యంత్రంపై ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.


వివరాలోకి వెళితే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా థాణే శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో బియస్పీ నేత సునీల్ కాంబ్లే ఈవియంపై ఇంకు చల్లి ఈవియం ముర్ధాబాద్ ఈవియంలు నహీ చేలేగా అంటూ నినాదాలు చేస్తుండడంతో అక్కడే ఉన్న పోలీసులు అతని అదుపులో తీసుకొని స్ధానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.