ఈవిఎం స్ట్రాంగ్ రూమును పరిశీలించిన మార్కాపురం ఆర్డీఓ
పొదిలి మండలంలో ఏర్పాటు చేసిన ఈవిఎం స్ట్రాంగ్ రూమును మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారి మరియు నియోజకవర్గ ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. స్ధానిక మండల రెవెన్యూ తహశీల్ధార్ కార్యాలయానికి సోమవారంనాడు ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగం వచ్చిన ఆర్డీఓ తహశీల్దార్ కార్యాలయం ప్రక్కన ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును పరిశీలించి తీసుకోవలసిన జగ్రత్తలు గురించి మరియు భద్రత ఏర్పాట్లు గురించి వివరించారు. ఆర్డీఓ వెంట రెవెన్యూ తహశీల్దార్ యస్ ఎం హమీద్, ఉప తహశీల్దార్ జానీ బేగ్, ఆర్ఐ సుబ్బారాయుడు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.