వివి ప్యాడ్ల లెక్కింపుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్

వివి ప్యాడ్ల లెక్కింపుపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ, సమజ్ వాది పార్టీ, తెలుగుదేశం పార్టీలతో సహా 21పార్టీలు కలిసి రివ్యూ పిటిషన్ ను శుక్రవారం దాఖలు చేశాయి.

కాగా ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లకు సంబంధించిన వివి ప్యాడ్లను మాత్రమే లెక్కింపుకు సుప్రీంకోర్టు అవకాశం ఇవ్వగా….. అలా కాకుండా 50శాతం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివి ప్యాడ్లను లెక్కించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా….. విచారణను సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.