ఈవీఎంల హ్యాకింగ్‌ చేయ్యవచ్చు

చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్తాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల హాడావుడి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వీవీపీఏటీ ఆధారిత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విస్తు గొలిపే బీబీసీ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దేశీయ ఈవీఎంలను హ్యాక్‌ చేసే మార్గాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ సైంటిస్ట్‌లు కనుగొన్నట్టు రిపోర్టు చేసింది.  మొబైల్‌ టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల ఎన్నికల ఫలితాలను యూఎస్‌ యూనివర్సిటీ సైటింస్ట్‌లు తారుమారు చేయొచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బీబీసీ న్యూస్‌ రిపోర్టు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది.

మిషన్లలో వెనుక డిస్‌ప్లే ఎలా ఉంటుందో అచ్చం అదే మాదిరి డిస్‌ప్లే బోర్డును రూపొందించినట్టు ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రొఫెసర్‌ జే అలెక్స్‌ హాల్డ్రర్‌మ్యాన్‌ చెప్పారు. ఈ డిస్‌ప్లే బోర్డు, మిషన్‌ చూపించే మొత్తం ఓట్లను కొల్లగొట్టి, వాటి స్థానంలో వేరేవి చూపించేలా రూపొందించామన్నారు. అదేవిధంగా ఈవీఎంలకు మైక్రోప్రాసెసర్‌లను కూడా మిచిగాన్‌ యూనివర్సిటీ రీసెర్చర్లు జత చేసి చూపించారు. దీని ద్వారా ఓటింగ్‌కు, ఓట్ల కౌంటింగ్‌కు మధ్య ఫలితాలను తారుమారు చేయొచ్చని బీబీసీకి తెలిపారు. భారత్‌ ఈవీఎంలను ప్రపంచంలో అత్యంత ట్యాంపర్‌ప్రూఫ్‌ ఓటింగ్‌ మిషన్లుగా వర్ణించారు. ఈ డివైజ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ అసలు ట్యాంపర్‌ చేయడానికి ఉండదు. ప్రజలు వేసే ఓట్లను, దాని కోసమే ప్రత్యేకంగా రూపొందించే కంప్యూటర్‌ చిప్స్‌లో స్టోర్‌ చేస్తారు. దీంతో ట్యాంపర్‌ చేయడం చాలా కష్టతరమవుతుంది. కానీ భారత ఎన్నికల కమిషన్‌ వాడే ఈవీఎంలను కూడా హ్యాక్‌ చేసే అవకాశముందని మిచిగాన్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు తేల్చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే రాష్ట్రాలకు కావాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీ లను కేటాయిస్తోంది.