రేపు పొదిలికి మాజీ మంత్రి బాలినేని రాక

  పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని ప్రైవేట్ జూనియర్ డిగ్రీ బీఈడీ కళాశాలల యాజమాన్య మిత్రుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నాడు స్థానిక మంజునాథ కళ్యాణ మంటపం నందు జరుగుతుందని కె వి రమణా రెడ్డి , వై వెంకటేశ్వరరావు గుండారెడ్డి, నరాల ఈశ్వర్ రెడ్డి, వి ఆర్ కే ప్రసాద్, అఖిబ్ అహమ్మద్ ఎంవి రమణా రెడ్డి గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ,శాసన సభ్యులు కె నాగార్జున రెడ్డి మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసులురెడ్డి తదితరులు హాజరుకానున్నారని కావున ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని ఒక ప్రకటన విడుదల చేశారు.