గుండెపోటుతో మాజీ ఎంపిపి కఠారి రాజు మృతి
పొదిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కఠారి రాజు(62) గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే మంగళవారం మాదాలవారి పాలెంలోని కార్యక్రమానికి వెళ్ళి తన ప్రాధమిక చికిత్స కేంద్రానికి వచ్చి కూర్చున్న కొద్ది సమయం వ్యవధిలోనే హఠాత్తుగా కుప్పకూలడంతో తన చికిత్సా కేంద్రం సిబ్బంది పొదిలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి పరీక్ష చేయించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. కఠారి రాజుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల, భార్య ఉన్నారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో 1983 సంవత్సరంలో తెలుగు దేశంపార్టీలో చేరి కాటూరి పెద్ద నారాయణస్వామి ముఖ్య అనుచరుడిగా ఉంటు నిబద్ధతతో పనిచేసి 1994 శాసనసభ ఎన్నికలలో కాటూరి నారాయణస్వామి స్వంతంత్ర అభ్యర్దిగా పొటిచేసినప్పుడు మద్దతుగా పనిచేశారు. రాజు చూపిన గురుభక్తికి మెచ్చిన కాటూరి పెద్ద నారాయణ స్వామి 1995మండల పరిషత్ ఎన్నికలలో తన సొంతగా స్వంతంత్ర కూటమి ఏర్పాటు చేసి రాజును మూడవ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి పోటీకి పెట్టి భారీ మెజారిటీతో గెలిపించి అనంతరం మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యే విధంగా తోడ్పడ్డారు. అప్పటి నుండి కాటూరి కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా ఉంటున్నారు. 1995 తరువాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఎన్టీఆర్ మరియు లక్ష్మిపార్వతి లతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ సమయంలో జిల్లా మంత్రిగా ఉన్న పాలేటి రామరావుతో సత్సంబంధాలు పెట్టుకొని మండల అభివృద్ధి కోసం నిధులు తీసుకుని మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి రాజకీయ జీవితం నుండి ఇప్పటికి ఎంతో మందికి వైద్య సేవలు అలాగే నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ…….. నిస్వార్థంగా అంకిత భావంతో పార్టీకోసం పనిచేస్తూ……. నిరుపేదలకు బాసటగా అమ్మసేవా సంస్థలో కీలకపాత్ర పోషిస్తూ……. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్న కఠారి రాజు హఠాన్మరణం చెందారన్న విషయం తెలుసుకుని ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పలువురు వైద్యులు అనుకోని ఈ పరిణామానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పిఎన్ఆర్ కాలనీ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.