పొదిలి నగర పంచాయితీ కి బార్ మంజూరు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన బార్ పాలసీ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 130 బార్లు ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
సర్కులర్ నెంబర్ 2199/2022 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 130 బార్లు కు ఈ వేలం కు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది.
పొదిలి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయితీ గా రూపాంతరం చెందడం నేపథ్యంలో పొదిలి నగర పంచాయితీ కి ఒక బార్ ను మంజూరు చేస్తు ఈ వేలం కు దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీ 27.07.2022 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.
50 వేలు జనాభా వరకు 5లక్షల రూపాయలు 50 వేలు నుంచి 5లక్షల జనాభా లోపు 7 లక్షల 50 వేల రూపాయలు 5 లక్షల జనాభా పైన 10 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజు గా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫీజు ప్రభుత్వం తిరిగి ఇవ్వదు
50 వేలు జనాభా లోపు ఉన్న పొదిలి నగర పంచాయితీ బార్ కు 5 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజు మరియు సంవత్సరానికి 15 లక్షల రూపాయలు లైసెన్సు ఫీజు గా ప్రభుత్వం నిర్ణయించింది.
అన్ని అనుమతులు మంజూరు అనంతరం సెప్టెంబర్ 1 తేదీ నుంచి 3 సంవత్సరాల కాల పరిమితికి బార్ లైసెన్స్ మంజూరు చేస్తుంది.