పొదిలిలో ఆర్ డి ఓ విస్తృత పర్యటన
కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి కిడారి సంపత్ కుమార్ పొదిలి మండలం లో విస్తృతంగా పర్యటించారు.
వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంకు విచ్చేసిన రెవిన్యూ డివిజన్ అధికారి కిడారి సంపత్ కుమార్ కార్యాలయం నందు రెవెన్యూ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు
స్పందన అర్జీలు ప్రగతి నివేదికను పరిశీలించి తదుపరి గృహ నిర్మాణ శాఖ అధికారులు తో కలిసి పట్టణంలోని జగన్ లేఔట్ ను సందర్శించిన అక్కడ జరుగుతున్న గృహ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం కంభాలపాడు గ్రామంలోని వివాదస్పదమైన బావిని పరిశీలించారు
ఈ పర్యటనలో తహశీల్దారు దేవ ప్రసాద్, వివిధ శాఖల మండల అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు