ఆహార కమీషన్ ఛైర్మన్ డైరెక్టర్ లు విస్తృత పర్యటన
ఆహార కమీషన్ ఛైర్మన్ విస్తృత పర్యటన
రేషన్ షాపు, రైస్ ఆటో, అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ
తహశీల్దారు కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, డైరెక్టర్ స్వర్ణ గీత లు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయాని సందర్శించారు.
అనంతరం రాష్ట్ర డైరెక్టర్ స్వర్ణ గీత తో కలిసి ఆంజనేయ స్వామి విధి నందు నిత్యావసరాల పంపిణీ చేస్తున్న రైస్ ఆటో వద్దకు వెళ్ళి కార్డుదారులతో మాట్లాడి పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్థానిక నేతపాలెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు వారి తల్లులు తో మాట్లాడి అంగన్వాడీ కేంద్రాల్లో చేసే సేవాలను గురించి అడిగి తెలుసుకొని అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన వంటలు రూచి చూసారు.
తదుపరి స్థానిక ఉన్న రేషన్ దుకాణాన్ని సందర్శించి స్టాక్ ను తనిఖీ చేశారు.
అనంతరం స్థానికంగా నివాసం ఉంటున్న రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ స్వర్ణ గీత నివాసం కు వెళ్లి తేనేటి విందు ను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు మరియు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు