తహశీల్దారు సమక్షంలో రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ సమక్షంలో రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం కు యత్నించిన సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.
పొదిలి మండలం నందిపాలెలం గ్రామానికి చెందిన కుందూరు వెంకట సుబ్బారెడ్డి, లైలమ్మ, లక్ష్మీ రెడ్డి కుటుంబంకు కంభాలపాడు,నందిపాలెం రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ భూమి ఉండగా తమకు తెలియకుండా తమ భూమిని ఇతరులకు ఆన్లైన్ చేసారని తమకు హక్కు కల్గిన వ్యవసాయ భూమి ఇతరులకు ఆన్లైన్ చేయటాని నిరసిస్తూ తమకు రెవెన్యూ అధికారులు న్యాయం చెయరని తమకు ఆత్మహత్య సరైన మార్గం భావించి గురువారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం కు కుందూరు వెంకట సుబ్బారెడ్డి,లైలమ్మ, లక్ష్మీ రెడ్డి రాగ తహశీల్దారు కార్యాలయం నందు లేకపోవడంతో కుటుంబం సభ్యుల్లో ఒకరైన లక్ష్మి రెడ్డి బయటకు వెళ్లి ఒక బాటిల్ లో పెట్రోల్ ఒక బాటిల్ కిరోసిన్ తీసుకొని వచ్చి అప్పుడే కార్యాలయంలోకి వచ్చిన తహశీల్దారు దేవ ప్రసాద్ సంబంధించిన విషయం పై రికార్డు తనిఖీలు చేస్తున్నా సమయం లో ఒక్కసారిగా బయట నుంచి వచ్చి తనతో తీసుకొని తెచ్చుకొన్న బాటిల్స్ ఓపెన్ చేసి ఒంటి మీద పొసుకొవటానికి ప్రయత్నం చేసే సమయంలో ఒకసారి గా తహశీల్దారు చాంబర్ తీవ్ర గందరగోళం తీవ్ర ఆందోళన నెలకొంది.
అప్రమత్తమైన రెవెన్యూ సిబ్బంది వారి దగ్గర నుంచి పెట్రోల్ కిరోసిన్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని పోలీసులు కు సమాచారం అందించాగా హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లోపులోనే తహశీల్దారు దేవ ప్రసాద్ బాధిత కుటుంబానికి నచ్చా జెప్పి వారి సమస్యా ను విని త్వరలోనే మీకు హక్కు కల్గిన వ్యవసాయ భూమిని మీ పేరు మీద పాస్ బుక్ మరియు ఆన్లైన్ లో పేరు నమోదు చేసి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతు కుటుంబం కార్యాలయం నుంచి వెనుదిరిగి పోయినారు.
ఈ సంఘటన తో ఒక్కసారిగా రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళన కు గందరగోళనికి గురైయ్యారు.