సజ్జ పంట అమ్మకాలు కోరకు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి: వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు వెల్లడి

ప్రస్తుతం ఖరీఫ్ 2021 లో సాగు చేసి అమ్మకానికి సిధ్ధంగా ఉన్న సజ్జ పంట పండించిన రైతులు మండల పరిధిలోని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా సజ్జ ఈ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు

రైతులు పండించిన సజ్జలు అమ్ముకొనుటకు సియం యాప్ ద్వారా గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా నవంబర్ 20వ తేదీ (శనివారం) లోపుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఒక వేళ రిజిస్ట్రేషన్ చేయించుకొని యెడల పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకొనుటకు వీలుపడదని అన్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీరు పండించిన సజ్జలను మ వారి ద్వారా కొనుగోలు చేయబడునని
కావున సంభందిత రైతులు మీ గ్రామ పరిధిలో గల రైతు భరోసా
కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు అన్నీ సకాలంలో పూర్తి చేసుకొని సజ్జలను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకొగలరని ఒక ప్రకటనలో తెలిపారు