మాస్కు ధరించని వారికి జరిమానా
పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలో మాస్కులు లేకుండా సంచరిస్తున్న వ్యక్తులకు 50రూపాయలు నుంచి 500వరకు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి బారినుండి తప్పించుకోవడానికి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించడంతో పాటుగా సామాజిక దూరాన్ని పాటించాలని పొదిలి యస్ఐ సురేష్ ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.