లాంఛనంగా రథం మరమ్మత్తులు, అలంకరణ పనులు ప్రారంభం
పొదిలి శివాలయం రథం మరమ్మత్తులు మరియు అలంకరణ పనులు మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ పార్వతీ సమేత నిర్మామహేశ్వర స్వామి వారి రథోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు స్థానిక శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి రథం మర్మత్తులు మరియు అలంకరణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నిమ్మగడ్డ వెంకట రవికుమార్, రథదాత సమంతపూడి నాగేశ్వరరావు, పట్టణ ప్రముఖులు పెరమసాని వెంకట రమణయ్య, కొత్తురి రమేష్, యుద్ధం నరసింహారావు, కొత్తురి శ్రీను, బుజ్జి, వినోద్, పాత్రికేయులు పేరుస్వాముల శ్రీనివాసులు , రామారావు, కె శ్రీనివాసరావు, శివాలయం దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ కాటూరి ప్రసాద్, ప్రధాన పూజారి సుబ్బనరసయ్య, మరియు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.