రైతు మహిళా సంఘాలు ఏర్పాటు – వ్యవసాయ అధికారి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
రైతు మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు పొదిలి మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ జైనులబ్దిన్ అన్నారు.
సోమవారం నాడు స్థానిక మండల పరిధిలోని కొండాయిపాలెం రైతు భరోసా కేంద్రంలో రైతు మహిళా సంఘాలు ఏర్పాటు కొరకు సమావేశం నిర్వహించామని ఇప్పటి వరకు మండలంలో 65 రైతు మహిళా సంఘాలు ఏర్పాటు చేసామని వ్యవసాయ శాఖ అధికారి షేక్ జైనులబ్దిన్ అన్నారు.
ప్రతి గ్రూపులో 12 మంది నుంచి 18 మంది వరకు సభ్యులు ఉండవచ్చని వారి యొక్క బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత, పంట శిక్షణ, యంత్ర పరికరాలు పంపిణీ, ఎరువులు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు