మాజీ సిఎం జగన్ ను కలిసిన కందుల, కాటూరి,కామునూరి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయస్సార్ కాంగ్రెసు పార్టీ) అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని నివాసం లో పొదిలి పట్టణానికి చెందిన పలువురు యువకులు కలిసారు .

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యువజన నాయకులు కామునూరి వెంకట్రావు, కాటూరి వారి పాలెం గ్రామానికి చెందిన కాటూరి వెంకట్రావు బృందం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ అయ్యిరు

పొదిలి పెద్ద చెరువు రిజర్వాయర్ పనులు నిలిచి పోయాయని విషయాన్ని జగన్ దృష్టికి తీసుకొని వెళ్ళి గా త్వరలోనే అంశంపై దృష్టి సారించి పనులు జరిగేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వారు తెలిపారు