శత్రువులుగా చూడడంవలనే ఇన్నిరకాల సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది: సిద్ధూ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కూమరస్వామి నన్ను మిత్రుడుగా నమ్మకస్తుడు కంటే ఒక శత్రువులా చూశాడాని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీ నాయకులు సిద్దరామయ్య అన్నారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు మైసూర్ నందు తనను విలేకరులతో సమావేశమైన సిద్దరామయ్య మాట్లాడుతూ కుమారస్వామి తనను శత్రువుగా చూడడంవలనే ఇన్నిరకాల సమస్యలు తెచ్చుకున్నాడని పరోక్షంగా ముఖ్యమంత్రి పదవి నుండి దిగవలసి వచ్చిందని ఆయన తెలిపారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న జనతాదళ్ సెక్యులర్ కాంగ్రెసు పార్టీ సంబంధాలు ఈ వ్యాఖ్యలతో మరో దుమారానికి తెరలేపిందనే చెప్పవచ్చు.