పోటీ పరీక్షల గ్రంథాలయం శిక్షణ ద్వారా ఉద్యోగం సంపాదించిన 8మందికి సత్కారం

పోటీ పరీక్షల గ్రంథాలయం శిక్షణ ద్వారా ఉద్యోగం సంపాదించిన 8మందిని ఘనంగా సత్కారించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని “సొసైటి ఫర్ సోషల్ ఛేంజ్” పోటీ పరీక్షల గ్రంథాలయం ఆధ్వర్యంలో గత సంవత్సరం కాలం నుండి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు గ్రంథాలయం ఏర్పాటు చేసి పలురకాల పోటీ పరీక్షలకు శిక్షణనివ్వగా వారిలో ఇటీవల సచివాలయం ఉద్యోగ పరీక్షల్లో 6మంది, ఇతర ఉద్యోగాలను మరో ఇద్దరు సంపాదించిన సందర్భంగా ఉద్యోగం సాధించిన అభ్యర్థులను సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయం నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మున్ముందు పోటీ పరీక్షల్లో మరోన్నో ఉన్నత ఉద్యోగాలు సంపాదించే విధంగా అభ్యర్థులకు శిక్షణనివ్వాలని…… అందుకు తమవంతుగా కావలసిన తోడ్పాటును అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు షేక్ నాసర్ మహమ్మద్, పొదిలిటైమ్స్ అవార్డు గ్రహీతలు మాకినేని రమణయ్య, శివరాజు, పట్టణ నాయకులు వాకా వెంకటరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రవి శంకర్, టి వెలుగొండయ్య, చోటా ఖాసిం, పెమ్మని బాల వెంకటేశ్వర్లు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.