నాబార్డు సహకారంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ

 నాబార్డు సహకారంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డు ఎంజిఎం వెంకట రమణ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు స్థానిక విశ్వనాథపురంలోని మాతృ కోచింగ్ సెంటర్ నందు షార్ప్స్ మరియు మాతృమూర్తి థెరీస్సా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి నాబార్డు ఎంజిఎం వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇప్పించి వారు స్వయం ఉపాధి పొందే విధంగా తయారు చేయాలనే తలంపుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదే విధంగా తమ దగ్గర శిక్షణ పొందిన వారికి ప్రెవేటు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసేందుకు అవకాశాలను కల్పించేందుకు నాబార్డు కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాబార్డు ఏజిఎం యుగంధర్ రెడ్డి, షార్ప్ సంస్థ అధ్యక్షులు రవిచంద్ర, మాతృమూర్తి థెరీసా సంస్థ చైర్మన్ కెల్లంపల్లి నజీర్, జి రాజేశ్వరరావు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.