శనివారం నాడు ఉచిత వైద్య శిబిరం
పొదిలి పట్టణంలోని తాలుకా ఆఫీస్ వీధిలోని ఎం జి క్లినిక్ నందు ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నారు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ శనివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం మరియు క్యాన్సర్ నివారణ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రూపాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో రొమ్ము మరియు చంకలో గడ్డలు , అధిక రుతుస్రావం లేదా క్రమంలేని రుతుచక్రం , చెవి లేదా మెడలో నొప్పి , దీర్ఘకాలంగా గొంతు మారుట , ఆహారం మింగుటలో ఇబ్బంది , బరువు తగ్గటం , ఎంతకు మానని దగ్గు , ఆకలి లేకపోవడం , నోటిపూత , మందులకు నయంకాని పుండ్లు లేదా గడ్డలు , కడుపు ఉబ్బరం , కడుపులోనొప్పి , గర్భాశయ ముఖద్వారం సంబంధిత వ్యాధ్యులు , నల్లటి మల విసర్జన , మూత్ర విసర్జనలో ఇబ్బంది , తరుచుగా విరోచనాలు , మలబద్ధకం , అకారణమైన అలసటకు చూడబడును .
గమనిక : మీ వద్ద పాత రిపోర్ట్స్ ఉన్నచో ఈ వైద్య శిబిరమునకు తీసుకొని రావలసిందిగా మనవి.
• ఈ శిబిరం నందు ఓ. పి. ఉచితంగా చూడబడును.
వివరములకు సంప్రదించండి – ఆర్. రూపస్ కుమార్ ( మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ )
Ph no: 9502206266,9652066133.