ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
అన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఆధ్వర్యంలో స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న గుడ్ షెఫర్డ్ వైద్యశాల నందు ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో మెదడు వెన్నుపూస మరియు నరముల వాధ్యుల నిపుణులు డాక్టర్ వి నీరజా, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ బి రామ లింగేశ్వరరావు, షుగర్, బిపి, గుండె, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు బి వి రమణారెడ్డి, గొల్డ్ మెడల్ లీస్ట్ జనరల్ సర్జన్ కోటా మాలకొండరెడ్డిలు
వందలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ బి రామ లింగేశ్వరరావు మాట్లాడుతూ మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నాడు ఉచితంగా వైద్యం శిబిరం ఏర్పాటు చేస్తామని అదే విధంగా అన్ని సరిగా జరిగితే పొదిలి శాస్వతంగా వైద్యశాల ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక చర్చ్ పాథర్ స్థానిక ప్రభుత్వ వైద్యులు డాక్టర్ బాలయ్య, సంస్థ మార్కెటింగ్ మేనేజర్ కోటి, పిఆర్ఓలు కాశీ, రామాంజీ, ప్రసాద్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు