వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు : కుందూరు
వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి వ్యవసాయ మార్కెట్ యార్డు సొంత భవనం నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ 9 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు పంపగా సంబంధించిన నిధులు మంజూరుకోసం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గురువారంనాడు రాష్ట్ర సచివాలయం నందు మార్కెటింగ్ శాఖ మంత్రి కన్నబాబును కలిసి నిధులు మంజూరు గురించి వినతి పత్రాన్ని అందజేయడంతో తక్షణమే స్పందించిన మంత్రి కన్నబాబు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో దరిశి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, పొదిలి మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జులా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.