జి శ్రీనుకు పితృవియోగం
వైసీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు జి శ్రీనుకు పితృవియోగం కలిగింది. వివరాల్లోకి వెళితే వైసీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు జి శ్రీను తండ్రి వెంకటేశ్వర్లు (75) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారంనాడు తెల్లవారుజామున పట్టణంలోని స్థానిక ఓబులశెట్టి వారి వీధిలోని వారి స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మార్కాపురం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంతాప కార్యక్రమంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, ఎంపిపి కోవెలకుంట్ల నరసింహరావు, వైసిపి యువత నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు.