జి శ్రీనుకు కేపి పరామర్శ

వైసిపి మాజీ మండలపార్టీ అధ్యక్షులు జి శ్రీనుకు గురువారంనాడు పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే….. కాగా ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారంనాడు మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి తన అనుచరులతో కలిసి జి శ్రీను ఇంటివద్దకు చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీనుకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కేపి విలేకరులతో మాట్లాడుతూ జి శ్రీనుకు పితృవియోగం కలిగిన సంగతి తెలిసి ఎంతో బాధపడ్డామని….. కానీ కొన్ని అనివార్య కారణాల రాలేకపోయామని అందుకే కొంత ఆలస్యం అయినప్పటికీ పరామర్శకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజ్జుల రమణారెడ్డి, కళ్ళం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు బందిసాహెబ్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.